
మహారాష్ట్రలోని ఎయిమ్స్వద్ద ఓ కుటుంబం డాక్టర్ను, పోలీసులను కొట్టిన ఘటన చర్చనీయాంశం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్సిడ్కో లోని ఎయిమ్స్కి చెందిన డాక్టర్ తో కారు పార్కింగ్విషయంలో పట్టణానికి చెందిన ఓ కుటుంబసభ్యులు గొడవకు దిగారు.
ఆయనపై దాడి చేశారు. డాక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని కారుని రోడ్డుపై నుంచి తీసి పక్కకు పెట్టాలని సూచించారు. వారు ససేమిరా అనడంతో పోలీసులు వారిని వారించారు. కోపోద్రిక్తులైన ఆ కుటుంబ సభ్యులు పోలీసులను దూషిస్తూ.. వారిపై దాడికి దిగారు.
ఆసుపత్రికి నిప్పు పెడతామని హెచ్చరించారు. పోలీసులపై దాడి చేస్తున్న క్రమంలో స్థానికులు నిందితులపై ఎదురు దాడి చేసి పోలీసులను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వైద్యుల ఫిర్యాదు మేరకు నిందితులు శివానంద్ అతని తల్లిదండ్రులు గజనన్, విజయలను సిడ్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.