కాకాకు నివాళులర్పించిన కుటుంబసభ్యులు

కాకాకు నివాళులర్పించిన కుటుంబసభ్యులు

వెంకటస్వామి 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్దనున్న కాకా విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ కాకా విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 

వెంకటస్వామి పెద్ద కుమారుడు మాజీ మంత్రి జి. వినోద్ సైతం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీకృష్ణ దంపతులు జయంతి వేడుకల్లో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శంకర్ రావు వెంకట స్వామికి నివాళులు అర్పించారు. కాకా కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల ప్రతినిధులు వెంకటస్వామి విగ్రహం వద్ద నివాళులర్పించారు.