ఒకే ఫ్యామిలీని వరించిన పదవులు..పలు పట్టణాల్లో భార్యాభర్తలు, తల్లీబిడ్డలు గెలుపు

ఒకే ఫ్యామిలీని వరించిన పదవులు..పలు పట్టణాల్లో భార్యాభర్తలు, తల్లీబిడ్డలు గెలుపు

వెలుగు నెట్​వర్క్: మున్సిపల్​ ఎన్నికల కౌంటింగ్​ సందర్భంగా పలు పట్టణాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు వార్డులో బరిలో నిలిచిన తల్లీబిడ్డలు, భార్యాభర్తలు విజయం సాధించారు. మెదక్ పట్టణంలో తల్లీ కొడుకులు కౌన్సిలర్లుగా గెలిచారు. 

14వ వార్డు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి దొంతి లక్ష్మి, 15వ వార్డు నుంచి అదే పార్టీ నుంచి కొడుకు నరేశ్​విజయం సాధించారు. మరోవైపు రామాయంపేట మున్సిపల్​ ఎన్నికల్లో 1వ వార్డులో కాంగ్రెస్​ అభ్యర్థి గజవాడ లావణ్య గెలుపొందగా, 7వ వార్డులో అదే పార్టీ నుంచి ఆమె భర్త గజవాడ నాగరాజు విజయం సాధించారు. 

నిర్మల్ పట్టణంలోని 36వ వార్డు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి అప్పాల కావ్య, 37వ వార్డు నుంచి ఆమె భర్త అప్పాల గణేశ్​ చక్రవర్తి గెలిచారు. కావ్య చైర్​పర్సన్ బరిలో ఉన్నారు. 27వ వార్డు నుంచి అహేషా కౌసర్, 39వ వార్డు నుంచి ఆమె భర్త తహీద్ ఉద్దీన్ రప్పు కాంగ్రెస్​ నుంచి గెలుపొందారు. 

వీరిద్దరు రెండోసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. వనపర్తి 15వ వార్డులో కాంగ్రెస్​ నుంచి ఎర్వ సౌమ్య గెలుపొందగా, 22వ వార్డు నుంచి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన ఆమె తల్లి ఎర్వ అరుణ గెలుపొందారు.