డికే అంటే డిజాస్టర్ అనుకుంటివా..డిసైడర్..

డికే అంటే డిజాస్టర్ అనుకుంటివా..డిసైడర్..

ఫినిషనర్ అన్న పదానికి దినేష్ కార్తీక్ పూర్తి న్యాయం చేశాడు. ఐపీఎల్లో రాణింపు గాలివాటం కాదని నిరూపించాడు.  తొలి మూడు వన్డేల్లో మోస్తారుగా రాణించిన కార్తీక్...కీలక మ్యాచ్లో అసలు సిసలైన డికేను చూపించాడు.  రాజ్కోట్లో సునామీ సృష్టించాడు. కేవలం 27 బంతుల్లో రెండు సిక్సర్లు, 9 ఫోర్లతో 55 రన్స్ చేసి.. టీ20 ఫస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. దినేష్ కార్తీక్ బ్యాటింగ్ను అభిమానులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సిక్సులు, ఫోర్లు కొడుతున్నప్పుడు డికే...డికే అంటూ నినాదాలు చేశారు.

తన సుడిగాలి ఇన్నింగ్స్తో దినేష్ కార్తీక్..రాజ్కోట్ స్టేడియాన్ని హోరెత్తిస్తే..అతని అభిమానులు  దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్పై సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. టీమిండియాకు సరైన ఫినిషనర్ దొరికేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధోని తర్వాత దినేష్ బెస్ట్ ఫినిషర్ అంటూ అకాశానికెత్తుతున్నారు. 

ఇక ట్విట్టర్లో  డీకేపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జట్టు ట్రబుల్లో ఉన్నప్పుడు..క్రీజుల్లోకి వచ్చిన దినేష్ కార్తీక్..సౌతాఫ్రికాకు ట్రబుల్గా మారాడాని పోస్ట్ చేశారు.  నెవర్ గివప్ అనే పదానికి డికే సరిగ్గా సరిపోతాడని కామెంట్స్ పెడుతున్నారు.  

ప్లైట్లో స్ప్రే మధ్యలో నుంచి దినేష్ కార్తీక్  నడుచుకుంటూ వస్తున్న వీడియోను  ఓ ఫ్యాన్ పోస్ట్ చేసి..వెల్ కమ్ బ్యాక్ దినేష్ కార్తీక్ అంటూ కామెంట్ పెట్టాడు.

 

ఓ నెటిజన్ అయితే దినేష్ కార్తీక్ను పుష్పతో పోల్చాడు. విమర్శకులు అతన్ని ఫెయిల్యూర్ క్రికెటర్ అనుకున్నారని..కానీ అతను డిజాస్టర్ కాదు..డిసైడర్ అని పేర్కొన్నాడు. 

ఫ్యాన్సే కాదు..మాజీ క్రికెటర్లు డికే ఇన్నింగ్స్ను మెచ్చుకుంటున్నారు. దినేష్ కార్తీక్..తన స్టోరీని తానే తిరగరాసుకున్నాడని కొనియాడారు.  మొత్తంగా మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.