
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను.. పోలీసులు నాంపల్లి FSLకు తరలించారు.. రెండు రోజుల కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్‌ను రికార్డింగ్ చేయనున్నారు. ఆ తర్వాత FSLలో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు చేయనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడిన ఆడియో, వీడియోల్లోని వాయిస్‌ను అధికారులు పోల్చి చూడనున్నారు. కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో FSL నివేదిక కీలకం కానుంది. మరోవైపు ఇవాళ్టితో నిందితుల కస్టడీ ముగియనుంది.
నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను పోలీసులు కస్టడీకి తీసుకున్నరు. నిన్న ఏడు గంటల పాటు సుదీర్ఘంగా పోలీసులు వారిని విచారించారు. కస్టడీ తర్వాత ఇవాళ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఏసీబి కోర్టు విచారణ జరుపనుంది. ఇక నిందితుల వద్ద లభించిన నకిలీ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, వంద కోట్ల డీల్ పై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.