ఫామ్ హౌస్ కేసు నిందితులకు ముగిసిన వాయిస్ టెస్ట్

ఫామ్ హౌస్ కేసు నిందితులకు ముగిసిన వాయిస్ టెస్ట్

ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుల కస్టడీ చివరి రోజు కావడంతో వారి నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణలో భాగంగా నిందితులకు వాయిస్ టెస్టులు ముగిశాయి. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిల్స్‭ను ఎఫ్ఎస్ఎల్ అధికారులు తీసుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడిన ఆడియో, వీడియోల్లోని వాయిస్‭ను పోల్చి చూడనున్నారు. ఈ కేసులో FSL నివేదిక కీలకం కానుంది. ఇక నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్, సింహాయజీను కస్టడీ నిమిత్తం రాజేంద్రనగర్ పీఎస్‭కు తరలించారు. 

విచారణ నిమిత్తం చంచల్ గూడ్ జైలులో ఉన్న వీరిని ముందుగా FSL కోసం నాంపల్లికి తీసుకువచ్చారు. ముగ్గురు నిందితులను సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించనున్నారు. అయితే ఒక్కోక్కరిని విడివిడిగా ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. వారి సమాధానాల ఆధారంగా కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.