రైతు  రుణమాఫీ  రూ. 2 లక్షల టార్గెట్ @ ఆగస్టు 15 

 రైతు  రుణమాఫీ  రూ. 2 లక్షల టార్గెట్ @ ఆగస్టు 15 
  •  రైతు  రుణమాఫీ  రూ. 2 లక్షల టార్గెట్ @ ఆగస్టు 15 

  • డెడ్ లైన్ కు ముందే చేసేలా ప్లాన్

  •  రూ. 2 లక్షల రుణమాఫీ కంప్లీట్

  •  కసరత్తు పూర్తి చేసిన ఆర్థికశాఖ

  • 6 లక్షల మంది రైతులకు లబ్ధి

  • రూ. 6వేల కోట్ల లోన్లు మాఫీ

  • తొలివిడత రైతులు: 11.42 లక్షల మంది

  • రుణాలు :రూ. 6,098 కోట్లు

  • రెండో విడత రైతులు:7 లక్షల మంది

  • రుణాలు:రూ.6,500 కోట్లు

  • 3వ విడత రైతులు: 6 లక్షల మంది

  • లోన్లు:  రూ. 6 వేల కోట్లు

హైదరాబాద్: పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటను నిలబెట్టుకోబోతంది. ఈ  నెలాఖరులోగా రుణమాఫీ పూర్తవుతుందని అందరూ భావించినా అంతకన్నా ముందే ఆగస్టు 15వ తేదీ లోపే కంప్లీట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన  ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.  మూడో విడతలో  రెండు లక్షల రుణాలున్న రైతుల అప్పులను మాఫీ చేయనుంది ప్రభుత్వం. 6 లక్షల మంది  రైతుల ఖాతాల్లో రూ. 6 వేల కోట్లను జమ చేయనుంది. 

జులై 18న దీనికి సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.1 లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారు. వడ్డీతో పాటు.. లక్ష వరకు ఉన్న రుణం ప్రతీ ఒక్కరి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. ఇక రూ.1.50 లక్షల రుణం ఉన్న రైతల ఖాతాల్లో జులై 31వ తేదీ లోపు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. జులై 30వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 18 లక్షలకు పైగా రైతులకు లబ్ధీ చేకూరింది. అయితే.. రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న రుణాలను ఆగస్టు 14 తేదీలోపు మాఫీ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు రుణమాఫీ లిస్ట్ అధికారులు విడుదల చేయనున్నారు. అదే రోజున రుణమాఫీని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ డిక్లరేషన్ కు కట్టుబడి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ఇప్పటికే  సీఎం  రేవంత్ రెడ్డి  ప్రకటించారు.