
వరంగల్: హుజురాబాద్ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై మాజీమంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే తాను మాత్రమే కరెక్ట్ అని భావించి.. తమ పార్టీ నేతలు పోటీచేయాలంటున్నారని ఆమె తెలిపారు. ఒకవేళ తాను హుజురాబాద్‌లో పోటీచేసినా... మళ్లీ వరంగల్‌కే వస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాంటి హామీ ఇస్తేనే హుజూరాబాద్‌లో పోటీచేస్తానని ఆమె తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో దమ్మున్న నేతలను డమ్మీ చేసేందుకే మమ్ములను అప్పుడు టీఆర్ఎస్లో చేర్చుకున్నారని ఆమె అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే గట్టిగా మాట్లాడుతానని.. ఐదేళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేశారని సురేఖ అన్నారు. కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని బయటకు వచ్చామని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో పరకాలకు వెళ్లి తప్పుచేశానని, కానీ ఇకపై వరంగల్‌లోనే ఉంటానని కొండా సురేఖ అన్నారు.