అన్నదాత ఆవేదన.. వడ్లకు నిప్పు

అన్నదాత ఆవేదన.. వడ్లకు నిప్పు

తాలు పేరుతో మిల్లర్లు భారీగా కోతలు విధిస్తున్నారని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పండించిన పంటకు సరైన డబ్బులు రావడం లేదన్న ఆవేదనతో వడ్లకు నిప్పంటించాడు. జగిత్యాల జిల్లా, మల్లాపూర్ కు చెందిన వంశీ రెడ్డి అనే రైతు కొన్ని రోజుల క్రితం ధాన్యాన్ని మల్లాపూర్ సహకారం సంఘం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. కాంటా పెట్టించి గుండంపల్లి శివారులోని వర్షిణి రైస్ మిల్లుకు తరలించాడు. ఐతే ధాన్యంలో తాలు, తప్ప ఉందని...3 కిలోలు అదనంగా కోత విధిస్తామని మిల్లర్ చెప్పాడు. ఐతే కోత నిబంధనల ప్రకారమే తూకం వేసి తీసుకొస్తే మళ్లి తాలు పేరుతో కోతలు విధించడం ఏంటని  రైతు మండిపడ్డాడు. కోత విధిస్తేనే ఆన్ లోడ్ చేసుకుంటామని మిల్లర్ చెప్పడంతో ధాన్యం బస్తాకి నిప్పంటించి ఆందోళనకు దిగాడు.  విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని ధాన్యం అన్ లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండి:

రైతన్న ఆగ్రహం.. వెల్లుల్లి పంటకు నిప్పు

కడప దర్గా ఉర్సు ఉత్సవాల్లో రెహమాన్‌