
న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలను రైతు సంఘాలు నాశనం చేయాలని చూస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు. ఆ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతు సంఘాలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ‘అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవడం గురించే రైతు సంఘాలు మాట్లాడుతున్నాయి. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవడం లేదు. అందుకే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రావడం లేదు. అన్నదాతల సమస్యలను అర్థం చేసుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అందుకే వారి దగ్గరకు కొన్ని ప్రతిపాదనలను పంపాం. కేంద్ర ప్రపోజల్స్‌ను వారు తిరస్కరించాల్సింది కాదు. ఈ చట్టాల్లో పలు మార్పులు తీసుకురావడానికి మేం ముందుకొచ్చాం. అంతిమంగా రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే మా అభిమతం. కానీ రైతు యూనియన్లు మొండిపట్టుతో వ్యవహరిస్తున్నాయి’ అని తోమర్ పేర్కొన్నారు.