ఫార్మాసిటీ పేరుతో రోడ్డున పడేశారు..బాధిత రైతుల ఆవేదన

ఫార్మాసిటీ పేరుతో రోడ్డున పడేశారు..బాధిత రైతుల ఆవేదన

యాచారం : భూములను నమ్ముకొని బతికే తమను ఫార్మాసిటీ పేరుతో రోడ్డున పడేశారని ఆవేదన చెందారు రైతులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపత్రిలో.. నేషనల్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో భూములు కోల్పోయిన రైతుల అభిప్రాయ సేకరణ జరుగుతోంది. కార్యక్రమానికి నేషనల్ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేశ్ కుమార్ ప్రజాపతి, సభ్యులు కౌశిద్ర సింఘ్ పటేల్, తల్లోజు ఆచారి హాజరయ్యారు. ఓబీసీ కమిషన్ ముందు తమ బాధ చెప్పుకున్నారు రైతులు.

ఇప్పుడు గ్రామాల్లో వ్యవసాయ భూములు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోయామన్నారు. రైతులను ఆర్డీవో, ఎమ్మెల్యే సతాయిస్తున్నారని.. మాకు భూములు ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు. ఆర్డీవో ఇవ్వలేదని.. కేసీఆర్ ఇవ్వలేదని. గుంజుకునే హక్కుకుడా వారికి లేదన్నారు.

భూములు పోతే బతుకలేమన్న రైతులు.. అందుకే అవసరం అయితే అందరం చస్తాం అప్పుడు ఉచితంగా తీసుకోండని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి రూపాయి కూడేసి భూములు కొన్నామని.. బోర్లు, బావులు తొవ్వుకున్నామన్నారు. కానీ నేడు ప్రభుత్వ అధికారులు సారవంతమైన భూములు లాక్కుంటామని భేదిరిస్తున్నారని, మా భూములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వమని తెలిపారు రైతులు.