
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2011 మనీ లెండింగ్ యాక్ట్, దాని నిబంధనలను వెంటనే అమలు చేయాలని సీఎస్ రామకృష్ణారావును రైతు కమిషన్ కోరింది. సోమవారం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎస్‌ను కలిసింది. గత పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు ప్రైవేట్ అప్పులే ప్రధాన కారణమని నివేదిక రూపంలో వివరించింది. ప్రైవేట్ అప్పులు, వాటిపై అధిక వడ్డీ రేట్లు కౌలు రైతులను ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని తెలిపింది.
2011 మనీ లెండింగ్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని, రైతుల ఆర్థిక భద్రతను కాపాడవచ్చని సూచించింది. రైతు ఆత్మహత్యల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరింది.