
హైదరాబాద్, వెలుగు: రైతును రాజుగా నిలబెట్టడం సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. కమిషన్ ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా బుధవారం సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించారు.
గత ఏడాదిలో ఏనుమాముల, నల్గొండ బత్తాయి, నిజామాబాద్ పసుపు మార్కెట్లను పర్యటించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన ములుగు రైతులకు రూ.4 కోట్లు పరిహారం అందేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విత్తన చట్టం ఆమోదం కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు