
- ప్రొఫెసర్ హరగోపాల్, నర్సింహారెడ్డికి రైతు కమిషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రొఫెసర్ హరగోపాల్, వ్యవసా య ఆర్థిక నిపుణులు డి నర్సింహారెడ్డి తమ సలహాలు, సూచనలు అందించాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. సోమవారం రైతు కమిషన్ కార్యాలయంలో రైతుల సమస్యలు, వ్యవసాయ సంస్కరణలపై కీలక సమావేశం జరిగింది. కోదండరెడ్డి అధ్యక్షతలో జరిగిన ఈ చర్చలో ప్రొఫెసర్ హరగోపాల్, నర్సింహారెడ్డి, కమిషన్ సభ్యు లు పాల్గొన్నారు.
దేశంలో మొదటిసారిగా రైతు కమిషన్ ఏర్పాటును ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశంసించారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇవ్వడం వల్ల వరి సాగు పెరిగినా, ఇతర పంటల విస్తీర్ణం తగ్గకుండా చూడాలని సూచించారు. విత్తన చట్టం అమలు రైతులకు లాభదాయకమని అభిప్రాయపడ్డారు. ఈ సలహాలు వ్యవసాయ రంగానికి మార్గదర్శకంగా ఉంటాయని కోదండరెడ్డి తెలిపారు.