నకిలీ మిరప విత్తనాలతో ఆగమైన అన్నదాతలు

నకిలీ మిరప విత్తనాలతో ఆగమైన అన్నదాతలు

నకిలీ మిరప విత్తనాలతో నిండా మునిగారు నాగర్ కర్నూల్ జిల్లా రైతులు. తాడూరు మండలంలో గుంతకోడూరుకు చెందిన రైతులకు కళాస్క్ కంపెనీకి చెందిన బంగారం అనే వెరైటీ పేరుతో మిరప విత్తనాలు అమ్మారు. దాదాపు వంద మంది రైతులు ఒక్కో ప్యాకెట్ కు 700 రూపాయల చొప్పున వీటిని కొనుగోలు చేసి నాటుకున్నారు. నాగర్ కర్నూల్ లోని ముగ్గురు వ్యాపారుల నుంచి వీటిని కొన్నారు. ఈ మిరప విత్తనాలతో అధిక దిగుబడితో పాటు… వైరస్ వ్యాప్తి ఉండదని  కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. అయితే ఇప్పుడు పంట ఓ మోస్తరుగానే ఎదిగింది. మొలకల టైమ్ లోనే వైరస్ వ్యాపించిందనీ… ప్రస్తుతం మూడు ఫీట్ల ఎత్తువరకూ మొక్కలు పెరగాలి. నిండుగా పూత, కాత ఉండాలి.  కానీ ఆ పరిస్థితి లేదంటున్నారు గుంతకోడూరు రైతులు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు.