నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బెల్ తారోడాలో కరెంట్ కోతలపై రైతులు ఆందోళన చేపట్టరాు. జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తామన్న సర్కారు మాటలు నీటిమీద రాతలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంట పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
