దేశవ్యాప్తంగా ఏప్రిల్​ 7న రైతుల ర్యాలి

దేశవ్యాప్తంగా ఏప్రిల్​ 7న రైతుల ర్యాలి

ఫిబ్రవరి 13 నుంచి రైతులు   ఎంఎస్సీ చట్టంతో సహా పలు సమస్యలను పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు.  దాదాపు  45 (వార్తరాసే రోజుకు) రోజులు అయినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.   దీంతో దేశ వ్యాప్తంగా రైతులు తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఏప్రిల్​ 7 వ తేదీన రైతు సోదరులు దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేయాలనా రైతు సంఘం నాయకులు తెలిపారు.  అలానే ఏప్రిల్​ 9న శంభు సరిహద్దు వద్ద రైల్వే ట్రాక్​ను దిగ్భంధం చేయనున్నారు. 

గతంలో రైతులు ఆందోళన చేసే సమయంలో యువ రైతు శుభకరన్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మరణించారు.  కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు యువ రైతు శుభకరన్ సింగ్ నివాళి సభలు నిర్వహించనున్నారు.  శంభు బోర్డర్ నుండి ఒక  బృందం అమరవీరుడు శుభకరన్ సింగ్ చితాభస్మాన్ని తీసుకుని ఢిల్లీ మీదుగా చెన్నైకి బయలుదేరింది.అక్కడి నుండి, ఈ యాత్ర దక్షిణ భారతదేశంలోని రైతు సంఘాల ద్వారా తమిళనాడు, కేరళ , పాండిచ్చేరిలో కొనసాగుతుంది.

చండీగడ్​లోని కిసాన్​ భవన్​ లో  యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్),కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ గోధుమ పంటను నేరుగా గోదాంల్లోకి తీసుకెళ్లాలని కేంధ్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పు పట్టారు.  బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.  

ఫిబ్రవరి నుంచి రైతులు ఆందోళన చేస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని.. ఇంకా కొంతమంది జైళ్లలోనే ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి.. రైతులను విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు.  శంభు బోర్డర్, ఖానౌరీ, దబ్వాలి, రతన్‌పురా బోర్డర్‌లోని రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు.  కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా విద్యుత్​ సరఫరాను నిలిపివేస్తున్నారన్నారు.  

ఈరోజు, యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్) , కిసాన్ మజ్దూర్ మోర్చా చండీగఢ్‌లోని కిసాన్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల అనేక మండీలను రద్దు చేసి గోధుమ పంటను నేరుగా గోతుల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఇది 3 వ్యవసాయ చట్టాలను మళ్లీ అమలు చేయడంతో సమానం. ఫిబ్రవరి 10 నుంచి హర్యానాలో వందలాది మంది రైతులను అరెస్టు చేశారని, అందులో 5 మంది రైతు నాయకులు ఇంకా జైల్లోనే ఉన్నారని రైతు నాయకులు తెలిపారు. శంభు బోర్డర్, ఖానౌరీ, దబ్వాలి, రతన్‌పురా బోర్డర్‌లో రైతులు నిలబడి ఉన్నారని చెప్పారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకు అన్ని సరిహద్దుల వద్ద ఉద్దేశపూర్వకంగా విద్యుత్తు వ్యవస్థకు అంతరాయం కలిగిస్తున్నారని, దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ALSO READ :- Sydney Sweeney: నాపై చాలా రూమర్స్ వస్తుంటాయి..వాటన్నింటిని వదిలేయండి