Sydney Sweeney: నాపై చాలా రూమర్స్ వస్తుంటాయి..వాటన్నింటిని వదిలేయండి

Sydney Sweeney: నాపై చాలా రూమర్స్ వస్తుంటాయి..వాటన్నింటిని వదిలేయండి

హాలీవుడ్‌ బ్యూటీ సిడ్నీ బెర్నిస్ స్వీనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెచ్‌బీఓ డ్రామా సిరీస్‌ యుఫోరియా తో ప్రపంచ వ్యాప్తంగా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ సిరీస్ సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. అయితే కొద్ది రోజులుగా ఈ అందాల రాశికి సంబంధించి ఓ పుకారు తెగ షికారు చేస్తోంది.

జానీ డెప్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'డే డ్రింకర్‌'లో హీరోయిన్గా సిడ్నీ స్వీనీ ని ఎంపిక చేశారని..ఆయనతో నటించేందుకు సిడ్నీ చాలా ఆతృతగా ఉందని ప్రచారం జరిగింది.దీనిపై సిడ్నీ బెర్నిస్ తాజాగా స్పందించింది. ఆ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. అవి పూర్తిగా అవాస్తవమని తెలిపింది.తన గురించి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయని..వాటన్నింటిని వదిలేయండని అభిమానులకు సూచించింది. 

ALSO READ :- అరుంధతిలో పశుపతిలా ఐదేళ్ల తర్వాత వచ్చాడు ఈ పసుపుపతి.. బాబుపై జగన్ కామెంట్స్

మీరు మాత్రం థియేటర్‌ కు వెళ్లి తన లెటెస్ట్ మూవీ 'ఇమ్మాక్యులేట్‌' ను చూసి ఎంజాయ్ చేయండని పేర్కొంది. దీంతో డే డ్రింకర్‌ సినిమాలో  సిడ్నీ బెర్నిస్ హీరోయిన్ గా చేస్తోందని వార్తలకు చెక్ పడింది.