అరుంధతిలో పశుపతిలా ఐదేళ్ల తర్వాత వచ్చాడు ఈ పసుపుపతి.. బాబుపై జగన్ కామెంట్స్

అరుంధతిలో పశుపతిలా ఐదేళ్ల తర్వాత వచ్చాడు ఈ పసుపుపతి.. బాబుపై జగన్ కామెంట్స్

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయభేరి పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఈ నేపథ్యంలో మదనపల్లిలో ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతిలాగా చంద్రబాబు బయటికి వచ్చాడని, ఐదేళ్ల తర్వాత బయటికి వచ్చిన ఈ పసుపుపతి వదల బొమ్మాళీ అంటున్నాడని అన్నారు. 

జగన్ ఎవడికి భయపడడని, 2019 లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చన ప్రభుత్వం మనదని అన్నారు.ఇప్పుడు ప్రతీ కార్యకర్త గడపకు వెళ్లి మా పార్టీకి ఓటు వేయండి అని అడుగుతున్నారు అంటే అది మన పార్టీ దమ్ము అని అన్నారు.99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని,10 మార్కులు కూడా తెచ్చుకొని స్టూడెంట్ కు భయపడతాడా అని అన్నారు.పేదల పక్షాన గెలుపు కోసం నేను సిద్ధమని,నా గెలుపు కోసం మీరంతా సిద్ధమేనా అన్నారు.

ALSO READ :- హవేలి ఘనపూర్ లో 5.83 లక్షలు.. కాళ్ల కల్ చెక్ పోస్ట్ వద్ద రూ. 62,000 వేలు