హవేలి ఘనపూర్ లో 5.83 లక్షలు.. కాళ్ల కల్ చెక్ పోస్ట్ వద్ద రూ. 62,000 వేలు

హవేలి ఘనపూర్ లో 5.83 లక్షలు..  కాళ్ల కల్ చెక్ పోస్ట్ వద్ద రూ. 62,000 వేలు

మెదక్ : మెదక్ జిల్లాలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 6.45 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. హవేలి ఘనపూర్  మండల కేంద్రంలో వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.5.83 లక్షల నగదును సీజ్​ చేశారు. మండలంలోని బోగుడ భూపతిపూర్ విల్ కార్డ్ హాల్ సెల్ కంపెనీ లిమిటెడ్ నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు. అయితే వారివద్ద డబ్బులకు సంబంధించి రసీదులు లేవని పోలీసులు తెలిపారు.

క్యాష్ ను కలెక్టరేట్ లో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. సరైన వివరాలు సమర్పించి తిరిగి తీసుకెళ్లవచ్చన్నారు. కాగా మనోహరాబాద్ మండలం కాళ్ల కల్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి నుంచి రూ. 62,000 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు.  ఓ డ్రం కంపెనీ లో  పనిచేస్తున్న సూపర్ వైజర్ నితిన్ కుమార్ ను తనిఖీ చేయగా ఎలాంటి పత్రాలు లేని డబ్బు దొరికిందన్నారు.

ALSO READ :- డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అడ్డగింత