పంద్రాగస్టున ప్రకటన కోసమే వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ను స్పీడప్ చేస్తున్నారు

పంద్రాగస్టున ప్రకటన కోసమే వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ను స్పీడప్ చేస్తున్నారు

సీతారం ఏచూరి విమర్శలు

న్యూఢిల్లీ: సైంటిఫిక్ అడ్వాన్స్‌మెంట్ అనేది ఆర్డర్ ఇవ్వగానే తయారయ్యేది కాదని సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి అన్నారు. పంద్రాగస్టున ప్రధాని మోడీ ప్రకటన చేయాలనే ఉద్దేశంతో కరోనా వ్యాక్సిన్ ప్రొడక్షన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) వేగవంతం చేస్తోందనే వార్తలపై సీతారం ఏచూరి మండిపడ్డారు. మహమ్మారి నుంచి బయటపడటానికి వ్యాక్సిన్‌ ఒక్కటే దివ్య ఔషధం కాగలదని, ప్రపంచం మొత్తం సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని సీతారాం చెప్పారు. ఆ వ్యాక్సిన్ వరల్డ్‌లో ఎక్కడైనా పని చేయగలగాలని, కానీ ఆర్డర్‌‌ ఇవ్వగానే సైంటిఫిక్ అడ్వాన్స్‌లు తయారవ్వవని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా అభివృద్ధి చేయాలని ఒత్తిడి చేయడం మంచిది కాదని, అందరి హెల్త్, సేఫ్టీని పట్టించుకోకుండా కేవలం పంద్రాగస్టున ప్రధాని మోడీతో వ్యాక్సిన్‌పై ప్రకటన చేయించాలనుకోవడం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని దుయ్యబట్టారు.

‘ట్రయల్ ప్రొటోకాల్ గురించి చర్చించుకోవడానికి ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీలకు తగిన టైమ్ ఇవ్వకుండా ట్రయల్స్ మొదలుపెట్టాలని ఐసీఎంఆర్ ఎలా ఆదేశిస్తుంది? దీంట్లోకి ఇన్‌స్టిట్యూషన్స్‌ను ఐసీఎంఆర్ ఎందుకు లాగాలని యత్నిస్తోంది? ట్రయల్స్ నిర్వహించే ఇన్‌స్టిట్యూట్స్‌లో  హైదరాబాద్‌లోని నిమ్స్‌ కూడా ఉంది. ట్రయల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందా? ఈ ట్రయల్స్‌లో ఎంతమందిని పరీక్షిస్తారు? ఎన్ని ఫేజ్‌ల్లో ట్రయల్స్‌ను నిర్వహిస్తారు? ఆగస్టులో 14లోగా ట్రయల్స్ పూర్తయి, వాటిని విశ్లేషణ కూడా ముగుస్తుందా? ఇండిపెండెంట్ డేటా సేఫ్టీ మానిటరింగ్ కమిటీ (డీఎస్‌ఎంసీ)లో ఉన్న సభ్యులు ఎవరు?’ అని సీతారాం ప్రశ్నించారు.