టోల్ ఛార్జీలా మజాకా.. ప్రతి నెలా రూ.5వేల కోట్లు వసూలు

టోల్ ఛార్జీలా మజాకా.. ప్రతి నెలా రూ.5వేల కోట్లు వసూలు

టోల్ ఛార్జీల మజాకా..గత ఏడాది టోల్ ఛార్జీలు చూస్తే..దిమ్మెర పోవాల్సిందే..సరాసరి నెలకు 5వేల కోట్ల  టోల్ వసూలు అవుతోంది. ఫాస్టాగ్ ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ. 5వేల కోట్లు వసూలు అయ్యాయని రోడ్డు రవాణా, రహదారులు  మంత్రిత్వ శాఖ యాన్యువల్ రిపోర్ట్ లో తెలిపింది. 

రోడ్డు రవాణా రహదారులు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం టోల్ వసూళ్లు రూ. 64వేల కోట్లకు పైగా వచ్చాయి. 2024 మార్చి నెలలో అత్యధికంగా 5వేల 911 కోట్లు వసూలు అయ్యాయి. అత్యల్పంగా జూలై 2023లో 4వేల 966 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. 2022 డిసెంబర్ లో అత్యధికంగా 4వేల 918 కోట్లు వసూలు కాగా.. అంతకుముందు 2021 డిసెంబర్ లో రూ. 3వేల 674 కోట్లు  మాత్రమే వసూలు అయ్యాయి.  

మార్చి31, 2024 నాటికి 8.81 కోట్లు ఫాస్టాగ్లను జారీ చేశారు. ETC ద్వారా రోజువారీ సగటు వసూళ్లు మొత్తం 98.5 శాతం పెరిగి రూ.190.67 కోట్లకు చేరాయి. మొత్తం 1365 జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆగస్టు జూలై 2023 నాటికి 98 శాతం నుంచి 99 శాతం టోల్ వసూలు మెరుగుపడింది. 

జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో స్థిరమైన పెరుగుదల ఉంది. దీనికి కారణం టోల్ సేకరణ ఎలక్ట్రానిక్ ఫాస్టాగ్ కి మారడమే మంత్రిత్వ శాఖ చెపుతోంది. ట్రాఫిక్ పెరగడం, టోల్ ఫీ రేట్లలో మార్పులు, కొత్త టోల్ రహదారుల పొడవును పెంచడం వంటివి టోల్ సేకరణ పెరుగుదలకు ఇతర కారణాలని చెప్పింది. 2015 నుంచి 2023 మధ్య కాలంలో దేశం అంతగా టోల్ వసూలు మూడు రెట్లు పెరిగింది. 2015లో రూ. 17వేల 759 కోట్లుండగా.. 2023లో 48వేల 028 కోట్లకు పెరిగింది. 

ఫాస్టాగ్ ట్రాఫిక్ అతుకులు లేకుండా ఉండేలా వాహనదారులనుంచి వసూళ్లలో పారదర్శకత పెంచడం కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) కార్యక్రమం అమలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణ, రహదారులు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 40 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి.. ప్లాజా లావాదేవీల ప్రాసెస్ చేయడానికి 14 అక్వైరర్ బ్యాంకులు పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.