ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి.. సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం

ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి.. సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం
  •     ఆదిలాబాద్ ​కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు, వారి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

అత్యాచార కేసులలో బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చర్యలు కృషి చేయాలన్నారు. బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు, వారిలో ధైర్యం నింపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రూ, ఎస్.రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీ కృష్ణ, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతకుమారి, ఈడి మనోహర్, ఇతర  శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.