ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే శివ నందిని, ఆకాష్ అనే ఇద్దరు నగరంలోని సుచిత్ర నుండి బోయిన్ పల్లికి బైక్ పై వెళ్తున్నారు. మెట్రో పిల్లర్ నంబర్ 44 వద్దకు రాగానే వారి దగ్గర ఉన్న ఇంటర్నెట్ కేబుల్ వైర్ కిందపడడంతో బైకును ఆకాష్ రోడ్డుపై ఆపాడు. వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఇద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు.

 యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్ట్ం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.