
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును, కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని రామాయంపేట పోలీసులు తెలిపారు.