ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ఇంటర్ సిటీ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు స్పాట్ డెడ్

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ఇంటర్ సిటీ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు స్పాట్ డెడ్

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటర్ సిటీ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురు చనిపోయారు. 

బంధువుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కొండమంజులూరు వెళ్లి ఆటోలో వేలూరు తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండటం శోచనీయం. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారిని బొంతా బాబురావు, బొంతా మంగమ్మ, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, ఎస్.లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో గాయపడిన వారిని గుంటూరు GGHకు తరలించారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగం ప్రయాణికుల ప్రాణాలను తీస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.