ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న లారీని ఓ కారు వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది కారు. 

కారులో నుంచి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ క్రమంలోనే మంటలు కారు నుంచి లారీకి వ్యాఫించాయి. దీంతో  మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు నెంబర్ ను గర్తించేందుకు ట్రై చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు విచారణ అనంతరం చెబుతామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.