వికారాబాద్, వెలుగు: గంజాయి సాగు చేస్తూ విక్రయిస్తున్న తండ్రీకొడుకుపై తాండూర్ఎక్సైజ్పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకును రిమాండ్‌కు పంపినట్లు జిల్లా ఎక్సైజ్సూపరింటెండెంట్విజయభాస్కర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని బార్వాద్గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పెంటయ్య, అతని కుమారుడు ప్రభాకర్తమ పొలంలో గంజాయి సాగు చేస్తున్నారు.
పక్కా సమాచారంతో మంగళవారం డీటీఎఫ్, తాండూర్ ఎక్సైజ్ టీం దాడి చేసి 108 గంజాయి మొక్కలు, కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ ను రిమాండ్‌కు పంపామని, అతని తండ్రి పరారీలో ఉన్నట్లు జిల్లా ఎక్సైజ్‌సూపరింటెండెంట్ పేర్కొన్నారు. డీటీఎఫ్‌సీఐ శ్రీనివాస్, తాండూర్ ఇన్చార్జి సీఐ రాణి, డీటీఎఫ్ ఎస్సై ప్రేమ్ కుమార్ రెడ్డి, తాండూర్ ఎక్సైజ్ ఎస్సైలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి విక్రేత అరెస్ట్
గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతినగర్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివసించే మహమ్మద్ ఆరిఫ్ మొబైల్ షాప్నిర్వహిస్తుంటాడు. బిజినెస్‌లో నష్టం రావడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కొంతకాలంగా మహారాష్ట్రలోని పర్బతి జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయి కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు. అతను కేపీహెచ్‌బీ కాలనీ రెండో రోడ్డులోని ఓ హాస్టల్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రూ.16 వేల విలువైన కిలో గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
షాపూర్‌నగర్‌లో ఒకరు..
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. షాపూర్‌నగర్‌లో మంగళవారం ఎం.అమరేశ్ గంజాయి అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు. 1.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మహారాష్ట్రలోని పర్లి నుంచి తెప్పించినట్లు అమరేశ్ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్‌చేసి, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

