కూతురుకు ఓటేసి చనిపోయిన తండ్రి

కూతురుకు ఓటేసి చనిపోయిన తండ్రి

చేవెళ్ల, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన తన కూతురుకు ఓటు వేసిన తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధ గ్రామమైన వెంకన్నగూడలో 14 వార్డు మెంబర్​గా రాములమ్మ పోటీ చేసింది. 

ఆమెకు ఓటు వేసిన తండ్రి సోలిపేట బుచ్చయ్య(60) పోలింగ్  బూత్  నుంచి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. వార్డు మెంబర్​గా రాములమ్మ విజయం సాధించారు.