చూస్తుంటేనే ఒళ్లు వణుకుతుంది : అనకొండకు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు

చూస్తుంటేనే ఒళ్లు వణుకుతుంది : అనకొండకు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు

కొంతమంది చిన్న చిన్న పాములకే చాలా భయపడిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అనకొండతోనే ఆటలాడుకుంటున్నాడు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఒట్టి చేతులతో దాన్ని పట్టుకోవడమే కాకుండా.. దానికి ముద్దు కూడా పెట్టాడు. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది అతని అసాధారణమైన ధైర్య, నైపుణ్యాన్ని నొక్కి చెబుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఫ్లోరిడాలోని జూ కీపర్ మైక్ హోల్‌స్టన్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. తనను తాను 'ది రియల్ టార్జాన్' అని పరిచయం చేసుకున్నాడు. ఆ వ్యక్తి అనకొండను నిర్భయంగా చేత్తో పట్టుకుని కనిపించాడు. కొన్ని క్షణాల తర్వాత దాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నట్టు ఈ వీడియో చూపించింది. ఆ తర్వాత ఆ పాము కాస్త శాంతింగానే దాన్ని తన రెండు చేతుల్తో నొక్కి పడుతూ.. దాని తలపై ముద్దు పెట్టాడు. అనంతరం పాము అతని చేతికి చుట్టుకోవడానికి ప్రయత్నించడంతో చూపరులు షాక్‌కు గురయ్యారు. కానీ దానికి అతను ఎలాంటి భయం, బెరుకూ లేకుండా దాన్ని నియంత్రించడం నిజంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియో ఇప్పటివరు 11మిలియన్లకు పైగా వ్యూస్ ను, 2లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. అనకొండను ఉక్కిరిబిక్కిరి చేయడం క్రేజీ అంటూ కొందరు, వాట్ ఏ ఎక్స్‌పిడిషన్ …వెనిజులా డెవిల్ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాడు అని ఇంకొందరు ఈ వీడియోకు కామెంట్ చేశారు. ముద్దుతో ముగించేశాడంటూ మరికొందరు చమత్కారంగా రాయగా.. కొందరు వ్యక్తులు మాత్రం కేవలం వీడియో కోసమే జంతువును బంధిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.