రేపు (ఫిబ్రవరి 22) గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

రేపు (ఫిబ్రవరి 22) గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్)–2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 న జరగనున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఉదయం11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష ఉంటుందని.. పరీక్ష ప్రారంభమైన10 నిమిషాల తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని శుక్రవారం ఆయన ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.