ఫెడరల్ బ్యాంకుకు రూ.703 కోట్ల లాభం

ఫెడరల్ బ్యాంకుకు రూ.703 కోట్ల లాభం

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకు ఫెడరల్ బ్యాంకుకు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో నికర లాభం 52.89 శాతం పెరిగి రూ.703.71 కోట్లుగా నమోదైంది.  బ్యాంకు గత ఏడాది ఇదేకాలంలో రూ.460.26 కోట్ల లాభాన్ని సంపాదించింది. మొత్తం ఆదాయం రూ. 3,870.90 కోట్ల నుండి రూ.4,630.30 కోట్లకు పెరిగింది. అసెట్​ క్వాలిటీని గమనిస్తే బ్యాంకు గ్రాస్​​ఎన్​పీఏలు 2021 సెప్టెంబర్ చివరి నాటికి  రూ.4,445.84 కోట్ల నుంచి రూ.4,031.06 కోట్లకు తగ్గాయి. నికర ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు 1.12 శాతం (రూ. 1,502.44 కోట్లు) నుంచి 0.78 శాతానికి (రూ. 1,262.35 కోట్లు) తగ్గాయని బ్యాంకు తెలిపింది.