
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.
నిధులు మొత్తం సంక్షేమానికి, జీతాలకే సరిపోతున్నాయని సీఎం చెబుతున్నారని, మరి విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పై ఉన్న శ్రద్ధ స్టూడెంట్ల భవిష్యత్తుపై లేదని విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రమేశ్‌బాబు, నరేశ్‌యాదవ్, సాత్విక్ పాల్గొన్నారు.