కశ్మీర్ పోలీసులు దేశానికి గర్వకారణం

కశ్మీర్ పోలీసులు దేశానికి గర్వకారణం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ పోలీసుల సేవలపై తాము గర్వంగా ఉన్నామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో వారు తీవ్రంగా శ్రమిస్తున్నారని మెచ్చుకున్నారు. టెర్రరిజం నిర్మూలనలో వారు ముందుండి నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన గ్యాలంట్రీ పురస్కారాల్లో కశ్మీర్ పోలీసులకు అత్యధికంగా 115 దక్కడంపై షా స్పందిస్తూ.. ఇది వారి శౌర్య, పరాక్రమానికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పోలీసుల సేవలకు మొత్తం దేశం గర్విస్తోందన్నారు. పోలీసుల సేవలు, త్యాగాలను గుర్తించడంలో మోడీ సర్కారు ముందుంటుందని.. వారికి దన్నుగా నిలబడేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

తలకిందులుగా త్రివర్ణ పతాకం ఎగరేసిన మంత్రి

సినీ నటుడు శ్రీకాంత్ కు కరోనా