కరోనా నుంచి కోలుకున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

కరోనా నుంచి కోలుకున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పాజిటివ్‌‌గా తేలిన వారిలో 80 శాతానికి పైగా రికవర్ అవుతున్నారు. కరోనా సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు కలిగిన వారు రెండు వారాల్లో కోలుకుంటుండగా.. సీరియస్‌ సింప్టమ్స్ ఉన్న పేషెంట్లు నాలుగు వారాల్లో రికవర్ అవుతున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నా ఆరోగ్యాన్ని లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడే అలసట, బలహీనత నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. 

కరోనా నుంచి కోలుకున్న వారు పాటించాల్సిన సూచనలు ఏంటో చూద్దాం..

  • దానిమ్మ, నారింజతోపాటు ఆపిల్‌‌, బొప్పాయి పండ్లను తినాలి. వీటి జ్యూస్‌‌లను కూడా తాగొచ్చు. దీంతోపాటు నీళ్లను బాగా తాగాలి. 
  • రాత్రి నిద్రించే ముందు పాలు తాగాలి. ఎముకలను బలోపేతం చేయడంలో పాలు కీలకపాత్ర పోషిస్తాయి. తినే ఆహారాంలో కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయల జ్యూస్‌లను కూడా తీసుకోవచ్చు. టమాటాలు, బీట్‌‌రూట్, బచ్చలికూర లాంటి కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్ బాగా ఉంటాయి. ఇవి బలహీనతను తగ్గిస్తాయి. 
  • అధిక ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లను కూడా డైట్‌లో చేర్చుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. 
  • కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మల్టీ విటమిన్స్‌తోపాటు విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లను వేసుకోవాలి. అలాగే డాక్టర్ల సూచనల్ని పాటించాలి. 
  • శరీరంలో వాటల్ లెవల్స్ పడిపోకుండా చూసుకోవాలి. కొబ్బరినీళ్లు, జ్యూస్‌లను కూడా తరచూ తీసుకోవాలి. 
  • కరోనా నుంచి కోలుకున్నాక శరీరంలో కొన్ని సమస్యలు రావడం సహజమే. కాబట్టి కొన్ని వారాల వరకు బాడీపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావొద్దు. తక్కువగా నడుస్తూ, చిన్నపాటి ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి.
  • ఆక్సిజన్ స్థాయిని చెక్ చేస్తూ ఉండాలి. కొన్ని రోజుల వరకు కుటుంబీకులకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా మాస్క్ కట్టుకోవాలి. కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చాక కూడా కనీసం పది రోజులు విశ్రాంతి తీసుకోవాలి.