
హైదరాబాద్: మాదాపూర్ లో ఆదివారం మధ్యాహ్నం ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్తూ అదుపు తప్పి పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఇద్దరు పాదచారులను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏసుబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే మరణించిన ఏసుబాబు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా .. ఏసుబాబు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు మృతదేహాన్ని తరలించవదంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు , ఏసుబాబు కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది