వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి  అధ్యయనోత్సవాలు

 వైభవంగా  శ్రీలక్ష్మీ నరసింహ స్వామి  అధ్యయనోత్సవాలు

రాష్ట్రంలో  ప్రముఖ   పుణ్యక్షేత్రమైన  యాదాద్రిలోని  శ్రీ లక్ష్మీ నరసింహ  స్వామివారి  సన్నిధిలో  అధ్యయనోత్సవాలు  వైభవంగా  జరుగుతున్నాయి. స్వామి వారిని  ఉదయం, సాయంత్రం  వివిధ అలంకార  సేవల్లో  బాలాలయంలో ఊరేగిస్తున్నారు.   ఉత్సవాలు  రెండు రోజు  కావడంతో  ఇవాళ ఉదయం  నరసింహ స్వామికి  వేణుగోపాలస్వామి అలంకరణ  చేశారు. అర్చకులు  ఈ అవతారం  విశిష్టతను  వివరించారు. ఈ నెల 18 వరకు  అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.  అప్పటివరకు స్వామి వారి  సుదర్శన  నరసింహ హోమం,  శాశ్వత కళ్యాణాలు,  బ్రహ్మోత్సవాలు రద్దు  చేశారు  ఆలయ అధికారులు.