ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరంగల్ బట్టల బజార్ లోని వేంకటేశ్వర స్వామి, భద్రకాళీ, ఖమ్మం అభయ వేంకటేశ్వ స్వామి ఆలయంతోపాటు స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి, గుంటుమల్లేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు దైవ దర్శనాల కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు ఉపవాస దీక్షలు చేశారు.
వెలుగు, వరంగల్/ ఖమ్మం ఫొటోగ్రాఫర్స్
