
లీడ్స్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును తన అకౌంట్లో వేసుకున్నాడు. శనివారం భారత్-శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో వన్డేల్లో 100 వికెట్లు తీసిన క్లబ్‌లోకి చేరాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో నాలుగో బాల్ కి కరుణరత్నె(10)ను పెవిలియన్ కు పంపి బుమ్రా ఈ ఘనత సాధించాడు. అతి తక్కువ వన్డేల్లో వంద వికెట్లు తీసిన రెండో భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.
అతని కంటే ముందు మహ్మద్ షమి ఉన్నాడు. షమి 56 వన్డేల్లో వంద వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 57 వన్డేల్లో ఈ రికార్డు అందుకున్నాడు. తర్వాత స్థానాల్లో ఇర్ఫాన్ పఠాన్(59 వన్డేల్లో), జహీర్ ఖాన్(65), అజిత్ అగర్కార్(67), జవగళ్ శ్రీనాథ్(68) ఉన్నారు.
A century of ODI wickets for Jasprit Bumrah ?
It's taken him just 57 games to reach the landmark – only one Indian has got there quicker ?
Can you guess who? ?#SLvIND | #CWC19 | #TeamIndia pic.twitter.com/mV9RXJLB9j
— ICC (@ICC) July 6, 2019