
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మందు, డబ్బులు పంచనని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లను స్వాగతిస్తున్న మని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లోని మిగతా ఎమ్మెల్యేలు, ఇతర పొలిటీషియ న్స్ కూడా మందు, డబ్బులు పంచకుండా ఎన్నికల ప్రచారం చేస్తామని ప్రకటించాల ని కోరారు. దాన్ని తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల అమలులో నేతలు పక్షపాతం వహిస్తే ప్రజా అగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. డబ్బు తీసుకొని ఓటు వేస్తే ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.