Ebola Effect On FIFA World Cup: ఫుట్బాల్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) టోర్నమెంట్ ప్రారంభానికి ముందే మరో టెన్షన్ మొదలైంది. ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo) లో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో.. ఆ దేశ నేషనల్ ఫుట్‌బాల్ జట్టు అమెరికాలో అడుగు పెట్టడానికి ముందే 3 వారాల (21 రోజులు) కఠినమైన క్వారంటైన్ లో ఉండాలని అమెరికా ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది.
కాంగో ప్రిపరేషన్స్ క్లోజ్:
ఎబోలా వైరస్ వ్యాప్తితో కాంగో రాజధాని కిన్షాసాలో జరగాల్సిన ప్రీ-టోర్నమెంట్ ట్రైనింగ్ క్యాంప్ అకస్మాత్తుగా రద్దయింది. దీంతో జట్టు సురక్షితంగా ప్రాక్టీస్ చేయడం కోసం బెల్జియంకు తరలి వెళ్లిపోయింది. కానీ, అమెరికా అధికారులు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. యూరప్‌లో ఉన్న సమయంలోనే కాంగో ప్రతినిధులంతా పూర్తి ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేశారు.
క్వారంటైన్‌లో ఉండాల్సిందే:
వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గిలియాని మాట్లాడుతూ.. జూన్ 11వ తేదీన హ్యూస్టన్ (అమెరికా) రావడానికి ముందు కాంగో జట్టు ఖచ్చితంగా 21 రోజుల పాటు తమ మెడికల్ బబుల్ నిబంధనలను పాటించాల్సిందే.. ఈ విషయాన్ని కాంగో ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం.. ఒకవేళ బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారు అమెరికాకు వచ్చే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు అని హెచ్చరించారు. గత 21 రోజుల్లో డీఆర్ కాంగో, ఉగాండా లేదా సౌత్ సూడాన్‌లో పర్యటించిన అమెరికేతర పౌరులెవరూ దేశంలోకి ప్రవేశించడానికి పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు.
►ALSO READ | భారత్‌లో ఫుట్బాల్ వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్టింగ్కి గ్రీన్ సిగ్నల్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అప్పుడే!
WHO హెచ్చరిక:
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కాంగోలో హెల్త్ రిస్క్ లెవెల్‌ను 'హై' నుంచి 'వెరీ హై' (Very High) కి పెంచింది. గ్లోబల్ లెవెల్‌లో ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, ఆఫ్రికా ప్రాంతంలో మాత్రం ముప్పు తీవ్రంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియేసస్ తెలిపారు.
ఒక్కరు తప్పు చేసినా.. టోర్నీ నుంచి జట్టు ఔట్:
కాంగో జట్టుకు ఇదొక పెద్ద పరీక్షగా మారింది.. నిబంధనలను పాటించే క్రమంలో ఏ ఒక్క ఆటగాడు తప్పు చేసినా లేదా ఎవరికైనా ఎబోలా లక్షణాలు (Symptoms) కనిపించినా.. మొత్తం జట్టును టోర్నీ నుంచి తప్పించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ 21 రోజుల క్వారంటైన్ విజయవంతంగా పూర్తయితే.. జూన్ 11వ తేదీన కాంగో జట్టు టెక్సాస్ చేరుకుంటుంది. అనంతరం జూన్ 17 (ఆదివారం) న హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో పవర్‌హౌస్ పోర్చుగల్ తో కాంగో తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది.
🚨 𝐄𝐁𝐎𝐋𝐀 𝐎𝐔𝐓𝐁𝐑𝐄𝐀𝐊 𝐀𝐋𝐓𝐄𝐑𝐒 𝐃𝐑 𝐂𝐎𝐍𝐆𝐎’𝐒 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐔𝐏 𝐏𝐋𝐀𝐍𝐒. 🇨🇩💔
— CUPID FC (@CUPID_FC) May 23, 2026
The DR Congo national team has been forced to cancel its 3-day training camp and farewell fan event in Kinshasa due to the escalating Ebola (Bundibugyo strain) outbreak in the… pic.twitter.com/Reb5bCTapB
