ఫుట్‌బాల్ మ్యాచ్ కంటే ఇవానా నోల్కే ఎక్కువ క్రేజ్.. వరల్డ్ కప్ గ్లామర్ క్వీన్ ఫోటోలు వైరల్!

ఫుట్‌బాల్ మ్యాచ్ కంటే ఇవానా నోల్కే ఎక్కువ క్రేజ్.. వరల్డ్ కప్ గ్లామర్ క్వీన్ ఫోటోలు వైరల్!

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్టేడియంలో ఇంగ్లాండ్, క్రొయేషియా జట్ల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంటే.. స్టాండ్స్‌లో మాత్రం ఓ క్రొయేషియా ఫ్యాన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తన బోల్డ్, గ్లామరస్ లుక్స్‌తో ఎప్పుడూ వార్త కథనాల్లో నిలిచే మోడల్ ఇవానా నాల్ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు ఆమె స్టేడియంలో రచ్చ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇవానా నాల్ సందడి: 
33 ఏళ్ల ఇవానా నాల్ క్రొయేషియా దేశ సాంప్రదాయ ఎరుపు-తెలుపు చెకర్డ్ థీమ్‌తో డీప్-నెక్ టాప్ ధరించి గ్రౌండ్ లోకి ప్రవేశించింది. గ్యాలరీలో నిలబడి చేతులతో హార్ట్ షేప్ చూపిస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. ఆ తర్వాత ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. క్రొయేషియా, లెట్స్ గో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. క్రొయేషియా బ్యూటీ ఇవానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, 2022లో జరిగిన ఖతార్ వరల్డ్ కప్ సమయంలో ఇవానా నాల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ టోర్నీలో ఆమె స్టైలిష్ ఎంట్రీలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌గా మార్చేసింది. ప్రస్తుతం ఆమె మోడలింగ్‌తో పాటు డీజేగా రాణిస్తుంది. 

ఇవానా అందాలకి ఫ్యాన్స్ ఫిదా: 
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇవానా క్రొయేషియా థీమ్ కలిగిన బికినీ టాప్ ధరించి కిరాక్ డీజే ప్రదర్శన ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.2018 ఫిఫా వరల్డ్ కప్‌లో రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా టీమ్.. ఈ సారి కూడా అదే తరహాలో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ కు దూసుకెళ్లాలని ఇవానా నాల్ కోరుకుంది. గ్రౌండ్ లో ప్లేయర్స్ ఆట ఒక ఎత్తయితే.. గ్యాలరీలో ఇవానా అందాల సందడి మరో ఎత్తుగా నిలిచింది.