FIFA World Cup 2026 Opening Ceremony: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లాక్ చేసే సరికొత్త రికార్డుతో స్టార్ట్ కాబోతుంది. సాధారణంగా వరల్డ్ కప్ అంటే ఏదైనా ఒక దేశంలో, ఒకే ఒక స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ జరగడం మనం చూశాం.. కానీ ఈసారి టోర్నమెంట్ రేంజ్ పెద్దది కావడంతో.. హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మూడు హోస్ట్ కంట్రీస్ అయిన మెక్సికో, కెనడా, అమెరికా దేశాలలో వేర్వేరుగా గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. జూన్ 11 నుంచి ఈ మూడు దేశాల్లో ఫుట్‌బాల్ పండుగతో పాటు మ్యూజిక్ ఈవెంట్ ఉండబోతుంది.
మూడు రోజులు.. మూడు సిటీలలో కలర్‌ఫుల్ ఈవెంట్స్:
* మెక్సికో సిటీ (జూన్ 11): అందరికంటే ముందుగా మెక్సికోలోని ఐకానిక్ 'ఎస్టాడియో అజ్టెకా' స్టేడియంలో ఫస్ట్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ వేడుకలు ముగియగానే మెక్సికో వర్సెస్ సౌతాఫ్రికా మధ్య టోర్నీ ఫస్ట్ మ్యాచ్ షురూ అవుతుంది.
* టొరంటో (జూన్ 12): కెనడా ఆడే ఫస్ట్ మ్యాచ్ కంటే ముందు టొరంటో సిటీలో రెండో ఓపెనింగ్ ఈవెంట్‌ను కలర్ఫుల్గా ప్లాన్ చేశారు.
* లాస్ ఏంజెల్స్ (జూన్ 12): అమెరికా వర్సెస్ పరాగ్వే మ్యాచ్ జరగబోయే ముందే.. లాస్ ఏంజెల్స్‌లోని ప్రఖ్యాత 'సోఫై (SoFi) స్టేడియం' లో ఆఖరి ఓపెనింగ్ వేడుకను నెక్స్ట్ లెవెల్లో నిర్వహించనున్నారు..
మైఖేల్ బుబ్లే, కేటీ పెర్రీలతో మ్యూజిక్:
ఈ ఓపెనింగ్ ఈవెంట్స్‌లో కేవలం ఫుట్‌బాల్ మాత్రమే కాదు.. గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ తమ పర్ఫార్మెన్స్లతో స్టేజ్ తగలబెట్టడానికి రెడీ అవుతున్నారు. మెక్సికో సిటీలో లాటిన్ ఫ్లేవర్ యాడ్ చేస్తూ జె బాల్విన్, టైలా, మానా, బెలిండా, లీలా డౌన్స్ వంటి పాప్ స్టార్స్ రచ్చ లేపనున్నారు. ఇక కెనడా, అమెరికా స్టేడియాలలో గ్లోబల్ సూపర్ స్టార్స్ మైఖేల్ బుబ్లే, కేటీ పెర్రీ, ఫ్యూచర్లు తమ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడానికి లైన్ లో ఉన్నారు.
►ALSO READ | టీవీలకు అతుక్కుపోయే నెల వచ్చేసింది.. ఒకవైపు FIFA వరల్డ్ కప్, మరోవైపు T20 ప్రపంచకప్!
90 నిమిషాల ముందే 'కల్చరల్ ఫెస్ట్':
ప్రతి స్టేడియంలోనూ మ్యాచ్ స్టార్ట్ కావడానికి సరిగ్గా 90 నిమిషాల ముందే ఈ ఓపెనింగ్ సెర్మనీ హడావుడి మొదలవుతుంది. ఇందులో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్, ఆయా దేశాల కల్చరల్ షోస్, ఫ్లాగ్ ప్రెజెంటేషన్స్, వరల్డ్ కప్‌లో ఆడే టీమ్స్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. స్టేడియంలో ఉన్న జనాలు మాత్రమే కాకుండా టీవీలు, మొబైల్స్‌లో చూసే గ్లోబల్ ఆడియన్స్‌కు కూడా ఒక కిర్రాక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఫిఫా టార్గెట్.
ఇండియాలో లైవ్ ఎక్కడ చూడాలి:
మన ఇండియాలో ఉన్న ఫుట్‌బాల్ లవర్స్ ఈ ఓపెనింగ్ వేడుకలు, మ్యాచ్‌లను అఫీషియల్ బ్రాడ్కాస్ట్ పార్ట్నర్స్ (స్పోర్ట్స్ ఛానెల్స్, ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్) ద్వారా లైవ్ చూడొచ్చు.. కాకపోతే టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల మనకు మ్యాచ్‌లు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున వస్తాయి కాబట్టి, లైవ్ మిస్ అవ్వద్దంటే అలారాలు సెట్ చేసుకోవడం మర్చిపోకండి.
