తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూసే వారికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. లేటెస్ట్ ఫీచర్లు, ఎక్కువ రోజులు వచ్చే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ తో కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ లో ఏమేం ఫీచర్లు ఉన్నాయి.. బ్యాటరీ బ్యాకప్, ధర, స్టోరేజీ, డిస్ ప్లే, ఏఐ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి లుక్ ఏద్దాం..
రియల్‌మీ P4 సిరీస్‌లో కొత్తగా P4R 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8000mAh భారీ బ్యాటరీ. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ 6.8 అంగుళాల 144Hz డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్ కోసం ప్రత్యేక వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.
►ALSO READ | AI గ్లాసెస్ తో మాస్ కాపీయింగ్.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ దుర్వినియోగంపై పెద్ద చర్చ
కెమెరా విషయానికి వస్తే.. 50 మెగాపిక్సెల్ AI రియర్ కెమెరా, పలు AI ఫీచర్లతో అందుబాటులో ఉంది. అలాగే గూగుల్ జెమినీ సపోర్ట్, AI టెక్స్ట్ స్కానర్, యాంటీ థెఫ్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరల విషయానికి వస్తే.. 4GB+128GB వేరియంట్ ధర రూ.18వేల999 నుంచి ప్రారంభమవుతుంది. తొలి సేల్‌లో రూ.2వేల బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ.16వేల999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.
