ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న అడ్వాన్స్డ్ టెకాలజీ. AI లేని రంగమంటూ లేదు.. అన్ని రంగాల్లో AI దూసుకుపోతోంది.. ఓ వైపు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాం అని సంతోషించే లోపే దాంతో అనేక అనర్థాలు కూడా ఉన్నాయని తెలిసి కొంత నిరాశకు లోనవుతున్న సమయం ఇది. AI టెక్నాలజీతో ఉత్పాదక పెరుగుతుండగా.. మరోవైపు ఉద్యోగాలు పోవడం, ఏఐతో మోసాలు, నష్టాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకు దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదొక్కటే కాదు ఇటీవల కాలంలో జరిగిన చాలా సంఘటనలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ దుర్వినియోగంపై పెద్ద చర్చ కు దారి తీసింది.
AI టెక్నాలజీ విద్యావ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణ.. అక్కడ ఇటీవల నిర్వహించిన ఓ కాంపిటిటీవ్ ఎగ్జామ్ లో అభ్యర్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ అడ్డంగా దొరికారు. వారి రిజల్ట్ ను రద్దు చేశారు అధికారులు.అంతేకాదు ఆ విద్యార్థులపై నాలుగేళ్లు ఏం ఎగ్జామ్ రాయకుండా నిషేధం విధించారు. మాస్ కాపీయింగ్ సాధారణ విషయమే అయినా.. దానికివారు ఉపయోగించిన టెక్నాలజీ ఇక్కడ ఆందోళన చెందే విషయం. AI గ్లాసెస్ ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేశారు ఆ విద్యార్థులు. ఈ ఘటనలో AI దుర్వినియోగంపై పెద్ద చర్చకు దారితీసింది
AI గ్లాసెస్ తో ఎలా కాపీ కొట్టారంటే..
దక్షిణ కొరియా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు వినియోగించిన AI గ్లాసెస్ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ గ్లాసెస్ లో ఉండే కెమెరాలు , మైక్రోఫోన్లు ఫొటోలు తీసి వాటిని విశ్లేషించి మైక్రోఫోన్ స్పీకర్ల ద్వారా సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా విద్యార్థులకు సాయపడ్డాయని అధికారులు గుర్తించారు.
ఈ AI గ్లాసెస్ .. సేమ్ టు సేమ్ సాధారణ కళ్లద్దాల మాదిరిగానే ఉంటాయి. వాటిని కంటితో గుర్తించడం చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. ఏఐ గ్లాసెస్‌ను గుర్తించేందుకు ప్రొక్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైనదో సరైన రీతిలో వాడకపోతే అంత ప్రమాదకరమని దక్షిణ కొరియా ఘటన మరోసారి స్పష్టం చేసింది. తరుచుగా వినిపిస్తున్న ఇలాంటి ఘటనలతో AI వినియోగానికి కఠిన రూల్స్ అవసరమనే చర్చకు దారి తీసింది.
