కథల ఎంపికలో మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు రూట్ మార్చారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా పక్కనపెట్టి కంటెంట్ నమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’(Irumudi). సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆగస్టు 21న మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.
రవితేజలో కొత్త కోణం..
ఈ చిత్రంలో రవితేజ ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తొలిసారిగా అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రను పోషిస్తుండటం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. నల్లని దుస్తులు, మెడలో మాల, నుదుట విభూతి-కుంకుమతో కనిపిస్తున్న ఆయన లుక్ ఇప్పటికే ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి-కూతురు అనుబంధం చుట్టూ సాగే భావోద్వేగ కథాంశం ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతోంది.
భక్తితో చిందేసే అయ్యప్ప సాంగ్స్..
భక్తి, భావోద్వేగం, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని అయ్యప్ప సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా రెండు పవర్ఫుల్ అయ్యప్ప సాంగ్స్‌ను జీవీ ప్రకాశ్ స్వరపరిచినట్లు సమాచారం.
►ALSO READ | Dridam OTT: ఓటీటీలోకి మరో మలయాళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ‘బంగారు పల్లకి’ పాట సినిమాకు హైలైట్‌గా నిలవనుందని టాక్. అంతేకాకుండా మరో పాట కూడా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయ్యప్ప మాల మహత్యం, శబరిమల యాత్రలోని ఆధ్యాత్మిక అనుభూతి, కాలినడకన కొండ మార్గం ఎక్కే భక్తుల భావోద్వేగాలను ఈ పాటల్లో ప్రతిబింబించనున్నట్లు సమాచారం.
అలాగే, తండ్రి కూతురి మధ్య వచ్చే సరదా సాంగ్, రవితేజ–హీరోయిన్ భవానీ శంకర్‌పై చిత్రీకరించిన మరో బ్యూటిఫుల్ సాంగ్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. బలమైన ఎమోషనల్ కథతో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ కెరీర్‌కు ఈ సినిమా కీలక మలుపు అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
#Irumudi will be the new format of commercial cinema ❤️@RaviTeja_offl @ShivaNirvana @MythriOfficial pic.twitter.com/F5AaBu3TgS
— G.V.Prakash Kumar (@gvprakash) June 7, 2026
హత్తుకునే జి.వి.సంగీతం..
జి.వి. ప్రకాశ్ కుమార్‌కు సరైన కథ దొరికితే ఆయన సంగీతం ఏ స్థాయిలో ఉరకలు వేస్తుందో ఎన్నోసార్లు చూశాం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను తన స్వరాలతో మరింత హార్ట్ టచింగ్ గా మార్చడంలో జీవీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. హృదయాన్ని హత్తుకునే మెలోడీలు, కదిలించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను భావోద్వేగాలకు దగ్గర చేసే సామర్థ్యం ఆయన సొంతం. ఈ నేపథ్యంలోనే ‘ఇరుముడి’ కోసం ఆయన స్వరపరిచిన అయ్యప్ప సాంగ్స్‌పై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
From the sets of #Irumudi ❤️#IRUMUDI in cinemas from 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟮𝟭𝘀𝘁, 𝟮𝟬𝟮𝟲 ❤🔥#IRUMUDI / #IRUMUDIKATTU
— Mythri Movie Makers (@MythriOfficial) June 10, 2026
Starring MASS MAHARAJA @RaviTeja_offl
A @ShivaNirvana film 🎬
A @gvprakash musical 🎺🎼@priya_Bshankar @MythriOfficial @saikumaractor #BabyNakshathra… pic.twitter.com/Vhtlvblqnx
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న రవితేజ..
రవితేజ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాలను అందుకోలేకపోయాయి. ఇటీవల విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, భారీ కమర్షియల్ హిట్‌గా నిలవలేదు. దీంతో ఇప్పుడు రవితేజ ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘ఇరుముడి’ పైనే ఉన్నాయి. అయితే, ఈ సినిమా కోసం ముందుగానే రవన్న, తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్.
వరుస డిజాస్టర్ల వల్ల తనను నమ్ముకున్న నిర్మాతలు నష్టపోకూడదని, వారిపై అదనపు భారం పడకూడదని భావించి రవితేజ భారీ త్యాగానికి సిద్ధపడ్డారు. గతంలో ఒక సినిమాకు దాదాపు రూ. 25 కోట్ల వరకు తీసుకున్న మాస్ మహారాజా, ఇప్పుడు తన రెమ్యూనరేషన్‌ను ఏకంగా రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చే వరకు నిర్మాతలను సేఫ్ జోన్లో ఉంచాలనే ఆయన నిర్ణయంపై టాలీవుడ్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
