MS Dhoni Attends Jharkhand T20 League: జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) ఐపీఎల్ రేంజ్‌లో సరికొత్తగా ప్లాన్ చేసిన జార్ఖండ్ టీ20 లీగ్ (Jharkhand T20 League) ఈ రోజు (జూన్ 10) రాంచీలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో మస్తు కలర్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది. ఈ ఇనాగ్రల్ ఎడిషన్ ఓపెనింగ్ సెరిమొనీకి మన మాజీ కెప్టెన్, రాంచీ లోకల్ బాయ్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) చీఫ్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. 'తలా' గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అరపులతో రాంచీ మొత్తం షేక్ అయిపోయింది.
కంటిన్యూగా 27 మ్యాచ్‌లు:
బీసీసీఐ గైడ్‌లైన్స్ ప్రకారం పక్కా ప్రొఫెషనల్‌గా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీ టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. టోటల్‌గా 27 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక లీగ్ స్టేజ్‌లో 24 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత జూన్ 22న రెండు సెమీ ఫైనల్స్, జూన్ 23న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పోటీపడే 6 జట్లు ఇవే:
* ఛోటానాగ్‌పూర్ రాయల్స్
* రాంచీ టైటాన్స్
* కోయిలాంచల్ సూపర్ కింగ్స్
* జంషెడ్‌పూర్ స్టీలర్స్
* ధన్‌బాద్ డైమండ్స్
* సంతాల్ స్ట్రైకర్స్
కనికా కపూర్ సాంగ్స్.. ధోని ముచ్చట్లు:
ఈ ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ ఫేమస్ సింగర్ కనికా కపూర్ తన కిర్రాక్ సాంగ్స్‌తో స్టేజ్ మీద రచ్చ లేపింది. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయాక ధోని ఈ వేడుకల్లో పాల్గొని ప్లేయర్లను విష్ చేశాడు. ధోని సింపుల్‌గా కార్ వేసుకుని స్టేడియానికి రావడం, కుర్ర ప్లేయర్లతో ముచ్చటించడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
►ALSO READ | రూట్‌కు షాక్.. టెస్టుల్లో నెంబర్-1 బ్యాటర్ గా గిల్.. స్థానాన్ని నిలబెట్టుకున్న బుమ్రా
మరిన్నీ వివరాలు:
* స్టేడియం ఎంట్రీ ఫ్రీ: రాంచీ స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లు చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం ఎలాంటి డబ్బులు కట్టకుండానే, ఎంట్రీ పూర్తి ఉచితంగా ఉంది.
* లైవ్ స్ట్రీమింగ్: ఒకవేళ ఇంటి దగ్గర కూర్చుని మ్యాచ్ లని చూడాలనుకుంటే.. మొబైల్స్ లేదా టీవీల్లో Jio Hotstar యాప్‌లో, DD Sports ఛానెల్‌లో మ్యాచ్‌లు అన్నీ లైవ్ ప్రసారం అవుతున్నాయి.
MS Dhoni in the Jharkhand T20 League ❤️
— Jara (@JARA_Memer) June 10, 2026
- Is Ambati Rayudu sitting on Thala's right side? 👀 pic.twitter.com/zCAu3JIJZQ
MS Dhoni at JSCA Stadium for the Jharkhand T20 League opening ceremony. 🦁🔥 pic.twitter.com/fPsX5venG6
— DHONI Trends™ (@TrendsDhoni) June 10, 2026
