పెద్ది సినిమా టికెట్ల రేటు పెంపు.. శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్

పెద్ది సినిమా టికెట్ల రేటు పెంపు.. శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్

తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌ పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల  పెద్ది  సినిమాకు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు.. పది రోజుల పాటు అనుమతినిస్తూ జూన్ 2వ తేదీన హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తూ ఈ మెమో జారీ చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై ఇవాళ(జూన్ 10)న  విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హోంశాఖ జారీ చేసిన ఆ మెమో పూర్తిగా అక్రమమని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమా టికెట్‌ ధరల పెంపు విషయంలో ఖచ్చితంగా జీవో 121 (GO 121) నిబంధనలనే అనుసరించాలని ఈ సందర్భంగా హైకోర్టు  సూచించింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.

►ALSO READ | ‘NBK111’ ఊచకోత గ్లింప్స్ రిలీజ్.. బాలయ్య పుట్టినరోజున 'న్యూ ఏజ్' విధ్వంసం!

పెద్ది సినిమాకు  టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న జీవో జారీ చేసింది.   సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు అదనపు టికెట్ ధరలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ పై రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 అదనంగా వసూలు చేయవచ్చు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం టికెట్ల ధరలు పెంచిన తర్వాత సింగిల్ స్క్రీన్లలో రూ.275, మల్టీప్లెక్స్ లో రూ.445 వరకు ఒక టికెట్ ధర ఉంది.