ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ కు కోహ్లీ, హార్ధిక్ దూరం.. ధర్మశాల చేరుకున్న రోహిత్ శర్మ

ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ కు కోహ్లీ, హార్ధిక్ దూరం.. ధర్మశాల చేరుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma: హామ్‌స్ట్రింగ్ గాయం (Hamstring Scare)తో ఆఫ్ఘనిస్థాన్ తో జరగబోయే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అని టెన్షన్ పడ్డ ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గాయం నుంచి కోలుకున్న హిట్‌మ్యాన్.. జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ఈరోజు (జూన్ 10) డైరెక్ట్‌గా చండీగఢ్‌ చేరుకున్నాడు. నేషనల్ టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి రోహిత్ ల్యాండ్ అయిపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్‌చల్: 
రోహిత్ శర్మ చండీగఢ్‌లో అడుగు పెట్టగానే దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. భారీ సెక్యూరిటీ నడుమ రోహిత్ నడుచుకుంటూ వస్తున్న సీన్ ఆ వీడియోలో ఉంది. బ్లాక్ పోలో షర్ట్, చేతికి వాచ్, కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని హిట్ మ్యాన్ ఫుల్ స్టైలిష్‌గా, చాలా క్యాజువల్‌గా నడుస్తూ కనిపించాడు. నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో రోహిత్ వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది.

డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ భరోసా: 
ఈ వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రోహిత్ శర్మ టీమ్‌కు సపోర్ట్‌గా ఉండనున్నాడు. వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ కి ముందు జట్టుని సెట్ చేయడానికి ముల్లాన్‌పూర్‌లో ప్లాన్ చేసిన స్పెషల్ ప్రిపరేషన్ క్యాంప్ కోసమే రోహిత్‌ను అర్జెంట్‌గా టీమ్‌లోకి తీసుకున్నారు. ఇటీవల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్‌లో కొందరు సీనియర్లకు, బోర్డుకు మధ్య లొల్లి నడుస్తోందనే రూమర్స్ వస్తున్న టైమ్‌లో.. రోహిత్ శర్మ చండీగఢ్‌కు రావడం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక పెద్ద బూస్టింగ్ అనే చెప్పాలి.

►ALSO READ | ధోని ఎంట్రీతో రాంచీ స్టేడియం షేక్.. గ్రాండ్గా జార్ఖండ్ టీ20 లీగ్‌ స్టార్ట్!

రోహిత్ ఖాతాలో రెండు రికార్డులు: 
* ఈ ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌లో బ్యాట్ ఝులిపిస్తే రోహిత్ శర్మ ఖాతాలో రెండు మైండ్ బ్లాక్ రికార్డులు పడటం ఖాయంగా కనిపిస్తుంది. 

* జాక్వెస్ కాలిస్ రికార్డ్ బ్రేక్: వన్డే హిస్టరీలోనే అత్యధిక రన్స్ చేసిన ఆల్-టైమ్ లిస్ట్‌లో రోహిత్ శర్మ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కాలిస్ చేసిన 11,579 రన్స్ రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్‌కు కేవలం 3 రన్స్ మాత్రమే కావాలి.. ఆ మూడు రన్స్ కొట్టేస్తే వన్డేల్లో 8వ అత్యధిక రన్ స్కోరర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు క్రియేట్ చేస్తాడు.

* మార్టిన్ గప్టిల్ రికార్డ్ క్లోజ్: కేవలం బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ రోహిత్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉన్న వన్డే ఔట్-ఫీల్డ్ క్యాచెస్ రికార్డును దాటడానికి రోహిత్‌కు కేవలం 2 క్యాచులు మాత్రమే అందుకోవాల్సి ఉంది.