అనవసరంగా బయటకొస్తే ఐసోలేషన్ సెంటర్ కు

అనవసరంగా బయటకొస్తే ఐసోలేషన్ సెంటర్ కు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఎంతా చెప్పినా వినకపోవడంతో.. రోడ్లపై తిరుగుతున్న వారికి ఏకంగా ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తున్నారు. చెన్నూర్ లో అనవసరంగా బయట తిరుగుతున్న 15 మందిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. బెల్లంపల్లి పట్టణంలోనూ కారణం లేకుండా బయటికి వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్ కు తీసుకెళ్లారు పోలీసులు. 

మంథని పట్టణంలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేశారు పోలీసులు. రూల్స్ పాటించకుండా.. ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న వారికి ఇలా అవేర్ నెస్ కల్పిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. జులాయిగా రోడ్లపై తిరుగొద్దని చెబుతున్నా కొంతమంది యూత్ వినడం లేదంటున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో లాక్ డౌన్  కఠినంగా అమలు చేస్తున్నారు  పోలీసులు. సుల్తానాబాద్ లో ఉదయం 10 గంటల తర్వాత ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగితే ఐసోలేషన్ సెంటర్ కి తరలిస్తున్నారు పోలీసులు. ఇందుకోసం  ప్రత్యేక వాహనాన్ని యూజ్ చేస్తున్నారు.  ప్రజలు కరోనా రూల్స్ బ్రేక్ చేయవద్దన్నారు పోలీసులు. తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ రవీందర్, సీఐలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.